One Tv News - NEWS / ఎన్టీఆర్ జిల్లా : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంతెలుగుదేశం యువ నాయకులు సంఘీభావ పాదయాత్ర ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర ఈనెల 15వ తారీఖున 1000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెంలో టిడిపి ఇన్చార్జ్ శావల. దేవద త్ ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు.
యాత్రలో భారీగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్ర నిర్వహించారు.
One Tv News