Wednesday, 15 April 2026 04:29:39 PM

యోగివేమన విశ్వవిద్యాలయం

కడప జిల్లా బద్వేల్

Date : 13 May 2023 07:22 PM Views : 341

One Tv News - NEWS / కడప జిల్లా : యోగివేమన విశ్వవిద్యాలయం, వారు నిన్న విడుదల చేసిన డిగ్రీ బి.యస్సీ, బీకాం, బి.ఒకేషనల్ మొదటి సెమిస్టర్ మరియు మూడవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ మరియు పీ.జి కళాశాల విద్యార్థులు 12 గ్రూపులకు 9 గ్రూపులలో టౌన్ ఫస్ట్, 80 శాతం ఉత్తీర్ణత సాధించి బద్వేలు పట్టణంలో అగ్రస్థానంలో నిలిచారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అభినందన సభలో కళాశాల పరిపాలనాధికారి, మునిసిపల్ వైస్ చైర్మన్ రాచపూడి వెంకట సాయి కృష్ణ మాట్లాడుతూ.. డిగ్రీ ఫలితాలలో తమ విద్యార్థులు ఇంతటి ఘన విజయం సాధించడం ఎంతో ఆనందదాయకమన్నారు. భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాల అధిరోహించాలన్నారు. చక్కటి విద్య, క్రమశిక్షణ తో పాటు, సంప్రదాయ కోర్సులు ఉద్యోగ ఉపాధి కోర్సులు కలిగి ఉండడం తమ కళాశాల ప్రత్యేకత అన్నారు.ఈ విజయానికి కారకులైన అధ్యాపక బృందానికి, విద్యార్థినీ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :