Tuesday, 21 April 2026 02:44:39 PM

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

కర్నూలు

Date : 08 June 2023 09:14 AM Views : 195

One Tv News - NEWS / కర్నూలు జిల్లా : దేశంలో అత్యున్నత మైన సిబిఐ ను ఒక సాధారణ ఎంపీ గూండాలతో నిలువరించారంటే మన రాష్ట్రం ఎటువైపు వెళుతుందని మాజీ మంత్రి టిడిపి నాయకులు అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంటరి గా పోరాటం చేస్తున్న వివేకానంద రెడ్డి కూతురు సునీతను చూస్తే బాధేస్తుందన్నారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకోవడం కోసం ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎవరు స్పందించకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లి సిబిఐ విచారించమంటే కర్నూల్ లో సిబిఐ ని అడ్డుకుంటారు ఎంత దుర్మార్గo రౌడీలు గుండాలు పెట్టి సిబిఐ ని రాకుండా చేశారన్నారు. ఎంతటి వ్యక్తులైన సిబిఐ విచారణకు రావాల్సిందేనని ఒక ఎంపీ ని సిబిఐ విచారించడానికి వెళ్తే రౌడీలు గుండాలు అడ్డుకోవడం ఎక్కడా చూడలేదు. భారతదేశంలో అత్యంత గొప్పదైన సిబిఐ వ్యవస్థ ను అడ్డుకోవడం ఏంటి ఈ వ్యవస్థ ఎక్కడ పోతుంది అని ప్రశ్నించారు. ముఖ్య మంత్రుల ను అరెస్ట్ చేసిన సిబిఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పోయిందన్నారు.

లాలు ప్రసాద్, జయలలిత, ముఖ్యమంత్రిలను,కేంద్ర మంత్రులను సైతం అరెస్టు చేసిన సిబిఐ. ఒక ఎంపీ ని ఆంధ్ర రాష్ట్రంలో ఒక హత్య కేసులో సిబిఐ విచారణకు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య . డాక్టర్ సునీతకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను తెలిపారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :