Tuesday, 21 April 2026 02:53:24 PM

మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రొపెసర్ కోదండరాం పిలుపు

మహబూబాబాద్

Date : 29 May 2023 06:34 PM Views : 159

One Tv News - NEWS / వికారాబాద్ జిల్లా : ఉద్యమకారులు కోరుకున్న తెలంగాణ రాలేదని..అందుకోసం ఉద్యమకారులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రొపెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జెఏసి ఆధ్వర్యంలో నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఉద్యమకారులు,ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... ఆంద్ర ఆధిపత్య ధోరణికి, నిరసనగా జరిగిన ఉద్యమానికి ప్రతీక అమరవీరుల స్థూపం అని, దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ ఉద్యమ ఘట్టాలను గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందని అన్నారు. నేటి తెలంగాణ లో పరిస్థితి లు ఉద్యమ కారులు ఆశించిన స్థితిలో లేవని మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఉద్యమ కారులకు పిలుపునిచ్చారు. పాలకులు మారితే సరిపోదని పాలన స్వభావం మారాలని అన్నారు.

తెలంగాణ లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని పండిన పంట ను అమ్మడంలో రైతు నానా కష్టాలు పడుతున్నారని, తరుగు పేరుతో రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని , నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు జరుగలేదని, ఉద్యోగాల కోసం పరీక్ష రాసిన విద్యార్థులు పేపర్ లీకులతో బేజారైతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :