Tuesday, 21 April 2026 02:55:16 PM

వేపగుంటలో చంద్రబాబు మత్య్సకారులతో ముఖాముఖీ

పెందుర్తి

Date : 19 May 2023 09:16 AM Views : 176

One Tv News - NEWS / విశాఖ జిల్లా : మత్స్యకారులపై ప్రత్యేక శ్రద్ధ చూపిన పార్టీ తెలుగుదేశమేనని టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ నగరం లోని పెందుర్తి నియోజకవర్గం పరిధి లోని వేపగుంటలో చంద్రబాబు మత్య్సకారులతో ముఖాముఖీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మత్స్యకారులు తమ సమస్యలను చంద్రబాబు ముందు ఏకరువు పెట్టారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయంగా బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావాలని ఆలోచన ఎన్టీఆర్‌దేనని చెప్పారు. అందుకే ఆయన రాజకీయంగా బీసీలకు ప్రధాన్యత నిచ్చారని గుర్తు చేశారు. తన పాలనలో బిసీ లకు రిజర్వేషన్ల ను 33 శాతానికి పెంచితే వైసీపీ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించిందని విమర్శించారు. 20 లక్షల మంది మత్య్సకారులుంటే... చేపల వేట నిషేధ సమయం లో వారికి అందించే 10వేల రూపాయల లబ్ధిని చాలా ఆంక్షలతో లక్షమందికే లబ్ధి చేకూరేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

మత్స్యకారులకు డీజిల్‌పై రాయితీ ఇచ్చిన ప్రభుత్వం టీడీపీనేనని చెప్పారు. మత్య్సకారుల ఆపధకాలం లో ఆరు లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చిన పార్టీ కూడా తెలుగుదేశమేనన్నారు. మళ్లీ యువతకు జాబు రావాలంటే-బాబు రావాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :