Tuesday, 21 April 2026 02:49:51 PM

బయటపడిన బిసి పాయింటు నిర్వాహకుడి బాగోతం

కోసిగి

Date : 18 May 2023 06:48 PM Views : 180

One Tv News - NEWS / కర్నూలు జిల్లా : ఓకే సారి డబ్బు సంపాదించాలని అనుకున్నాడో ఏమో పాపం ఆ వ్యక్తి పొదుపు మహిళాలనే టార్గెట్ చేశాడు... పోదుపు మహిళలు అప్పు కట్టడానికి వచ్చిన డబ్బులను బ్యాంకు కు కుట్టకుండా ఖాతా దారులకు పేపర్ పై సీల్ వేసి సంతకం చేసి పంపిస్తున్నాడు ఓ sbi బ్యాంకు కు సంబంధించిన బిసి పాయింటు నిర్వాహకుడు నీలి నరసింహులు... ఈయన బాగోతం వెలుగులోకి రావడంతో sbi బ్యాంకు మేనేజర్, బిసి పాయింటు నిర్వాహకుడి id ని లాక్ చేశారు... దీంతో బిసి పాయింటు బంద్ చేయడంతో పోదుపు మహిళలు, బ్యాంకు ఖాతా దారులు తమ అకౌంట్లును చెక్ చేసుకోవడానికి మేనేజర్ ను కలిశారు...మిని స్టేట్ మెంట్ తీసేసరికి బిసి పాయింటు నిర్వాహకుడి బాగోతం బయటపడింది... దీంతో ఖాతా దారులు లబోదిబోమంటున్నారు... బిసి పాయింటు నిర్వాహకుడు చేసిన నిర్వాకానికి sbi బ్యాంకు అధికారులు తలదించుకుని విధ తయారైందని కర్నూలు జిల్లా కోసిగిలో చర్చనీయంగా మారింది. కోసిగిలో వందలాది పోదుపు గ్రూపులు ఉన్నాయి.

తన దగ్గరకు నెల నెలా పోదుపు తో పాటు అప్పు చెల్లించడానికి వచ్చిన పోదుపు మహిళలను టార్గెట్ చేశాడు... తమ అప్పు తో పాటు పోదుపు కట్టడానికి వచ్చిన మహిళలకు పేపర్ పై సంతకం, సీల్ వేసి డబ్బులు కట్టినట్లు రిసిప్ట్ ఇచ్చి పోదుపు మహిళలను మోసం చేసున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :