Tuesday, 21 April 2026 02:45:04 PM

యువత కు విస్తృతంగా ఉపాధి కల్పన

విశాఖ

Date : 17 May 2023 09:26 AM Views : 175

One Tv News - NEWS / విశాఖ జిల్లా : యువత కు విస్తృతంగా ఉపాధి కల్పన కోసమే ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో రోజ్ గార్ మేళా నిర్వహిస్తున్నారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ వెల్లడించారు. విశాఖ నగరంలోని పోర్ట్ స్టేడియం లో ఐదవ రోజ్ గార్ మేలాను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొత్తం 10 లక్షల మందికి ఉపాధి కల్పన ధ్యేయం అన్నారు. ఇందులో భాగంగా నేడు దేశ వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 71 వేల మందికి వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉపాధి నియామక పత్రాలు అంజేస్తున్నట్లు ఆయన తెలిపారు. రక్షణ, వైద్య రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతోందని అన్నారు. యువత ఉజ్వల భారత్ సాకారం దిశగా అడుగులు వేస్తుందన్నారు.

దేశంలో 39 కోట్ల మందికి ముద్రా పథకం ద్వారా రుణాలు మంజూరు చేశామని మంత్రి భగవత్ కిషన్ గుర్తు చేశారు. అనంతరం ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ప్రసంగించారు. తరువాత అతిధుల చేతుల మీదుగా 400 మందికి ఉపాధి నియామక పత్రాలు అందజేశారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :