Sunday, 19 April 2026 07:09:20 PM

మండలంలో రాత్రి కురిసిన గాలి వానలు మండలంలోని రైతులకు కన్నీరు

మహానంది

Date : 09 June 2023 08:56 AM Views : 182

One Tv News - NEWS / నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లా మహానంది మండలంలో రాత్రి కురిసిన గాలి వానలు మండలంలోని రైతులకు కన్నీరు మిగిల్చాయి. మండలంలోని బుక్కాపురం ,మహానంది, తిమ్మాపురం,గోపవరం వంటి గ్రామాల్లో చేతికి వచ్చిన అరటి పంటలు గాలివానకు నేలకొరిగాయి. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు పూర్తిగా దెబ్బ తినడంతో మండలంలోని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.

అరటి పంటలకు దాదాపు ఒక ఎకరానికి 1,50,000 పెట్టుబడి పెట్టామని చేతికొచ్చిన పంట ఇలా నేలపాలు కావడం చాలా బాధగా ఉందని రైతులు తమ ఆవేదనని వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :