Tuesday, 21 April 2026 02:48:24 PM

విద్యుత్ భవన్ వద్ద వామపక్ష పార్టీలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా

ఏలూరు

Date : 30 June 2023 04:51 PM Views : 168

One Tv News - NEWS / ఏలూరు జిల్లా : ప్రజలపై భారాల మోపే విద్యుత్ ఛార్జీల పెంపు స్మార్ట్ మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా ఏలూరులోని విద్యుత్ భవన్ వద్ద వామపక్ష పార్టీలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆరు రకాల పేర్లతో విద్యుత్ బిల్లులు పెంచడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలపై తీవ్రమైన విద్యుత్ చార్జీలు మోపుతున్నారని విమర్శించారు న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరావు మాట్లాడుతూ సామాన్యులే కాదు మధ్యతరగతి వర్గాలు కూడా భరించలేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయని ఆరోపించారు ఒక పక్కన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలన్నీ పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ చార్జీలు పెంచడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :