Wednesday, 15 April 2026 04:36:32 PM

ఉద్యోగ- కార్మికుల సమస్యలను ఆగస్టు 1వ తేదిలోపు పరిష్కరించాలి..!

Date : 21 June 2024 07:07 PM Views : 153

One Tv News - NEWS / కడప జిల్లా : ఉద్యోగ- కార్మికుల సమస్యలను ఆగస్టు 1వ తేదిలోపు పరిష్కరించాలి..!

మున్సిపల్ ఉద్యోగ- కార్మికుల సమస్యలను ఆగస్టు 1వ తేదిలోపు పరిష్కరించాలని, లేనిపక్షంలో నిరవధిక సమ్మె నిర్వహిస్తామని బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ తెలిపారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసుని వారు మున్సిపల్ కమిషనర్ కి అందించారు. పారిశుద్ధ్య కార్మికులకు రావలసిన 3 నెలల బకాయి వేతనాలను మంజూరు చేయాలని వారు కోరారు. పారిశుద్ధ్య కార్మికుల పైన సచివాలయ పారిశుద్ధ్య కార్యదర్శులు, మున్సిపల్ అధికారుల వేధింపులు అరికట్టాలన్నారు. ఆగస్టు ఒకటో తేదీ లోపు సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెబాట పట్టవలసి వస్తుందని తెలిపారు. సమ్మె ద్వారా ప్రజలకు జరిగే అసౌకర్యానికి మున్సిపల్ అధికార పాలకవర్గాలే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరించారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :