Tuesday, 21 April 2026 07:12:02 PM

రూ.2 వేల నోట్లకు సంబంధించి ఆర్బీఐ సంచలన ప్రకటన

ఆర్బీఐ

Date : 19 May 2023 11:31 PM Views : 177

One Tv News - NEWS / కర్నూలు జిల్లా : రూ.2 వేల నోట్లకు సంబంధించి ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది. ఆ నోట్లను త్వరలో ఉపసంహరించుకుంటున్నట్లు (Rs 2000 Notes To Be Withdrawn) ప్రకటించింది.రెండు వేల రూపాయల నోట్లు నిల్వ చేసుకున్న వారంతా .. సెప్టెంబర్ 30లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రెండు వేల నోట్లను (Rs 2000 Notes To Be Withdrawn) వినియోగదారులకు ఇవ్వొద్దని బ్యాంకులకు సైతం మార్గదర్శకాలు ఇచ్చింది. మే 23 నుంచి అన్ని బ్యాంకులతో పాటు 19 ఆర్బీఐ రీజనల్ బ్రాంచ్ లో ఈ నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. 

ఈ ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని సూచించింది. ఈ రోజు నుంచి రూ.2 వేల నోట్ల జారీని నిలిపివేస్టున్నట్లు తెలిపింది. ఒక రోజులో ఒక వ్యక్తి రూ.20 వేలు మాత్రమే నోట్లను మార్చుకోవడానికి వీలుంటుందని తెలిపింది.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :