One Tv News - NEWS / అనంతపురం జిల్లా : తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదిగా ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైకాపా అరాచక పాలనను ఎండగడుతూ చేపట్టిన భవిష్యత్తుకు భరోసా బస్సు యాత్రను లోకల్ నాయకులు అందరూ కలసికట్టుగా విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి, సీనియర్ నాయకుడు చౌళం మల్లికార్జున, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన్ చౌదరి, డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి పేర్కొన్నారు.
ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం (ఎన్టీఆర్ భవన్) లో బస్సు యాత్ర విజయవంతం చేయడంపై టీడీపీ స్థానిక సీనియర్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ రేపటి రోజు ఉదయం 9 గంటలకు కుందుర్పి మండలం శీగలపల్లి గ్రామం నుంచి ప్రారంభమయ్యే భవిష్యత్తుకు భరోసా బస్సు యాత్రను విజయవంతం చేయాలని అందుకు ప్రతి గ్రామం నుంచి స్థానిక నాయకులు మన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చేలా గ్రామ స్థాయిలో నాయకులు చొరవ చూపాలని తెలిపారు.
One Tv News