One Tv News - NEWS / మెదక్ జిల్లా : మెదక్ జిల్లా టేక్మాల్ మండల సర్వసభ్య సమావేశంఎంపీపీ చింత స్వప్న రవి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి మండలంలోని ప్రజాప్రతినిధులు అధికారులు హాజరయ్యారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. విద్యుత్ శాఖ పనితీరు మిషన్ భగీరథ , ఐసిడిఎస్ ప్రాజెక్టు, వైద్య ఆరోగ్య,ఐకేపీ, ఉపాధి హామీ, రెవెన్యూ ,పశుసంవర్ధక, విద్యా, శాఖల,అధికారుల పనితీరుపై గ్రామ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ లీకేజీల కారణంగా త్రాగునీటి సమస్య ఏర్పడుతుందని అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టేక్మాల్ సర్పంచ్ మాట్లాడుతూ రాత్రి పూట వర్షాల కారణంగా చెట్ల కొమ్మలు విరిగి పడి విద్యుత్ స్తంభాలు విరిగితే రాత్రి పూట విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుందని దీనికి తగినట్టు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.అవసరమైన చోట విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేయమని అధికారులకు విన్నవించినా ఫలితం మాత్రం శూన్యం అని పేర్కొన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి నందు పగలు డాక్టర్ అందుబాటులో ఉన్న రాత్రి సమయాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండకుండ వేరే ఆసుపత్రులకు సిఫార్సు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు?దీనికి తోడుగా ప్రభుత్వ అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యం అని అన్నారు.చివరగా ప్రభుత్వం చేపడుతున్న కళ్యాణ లక్ష్మీ కార్యక్రమం గురించి అవసరమైన అధికారుల సంతకాలం కోసం లబ్దిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని కావున సత్వరమే గెజిటేడ్ సంతకాలు ఎవరు పెడతారో సర్పంచ్లు ఎంపిటీసీలు, సంబందించిన శాఖల అధికారులను కోరారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతా స్వప్న రవి,ఎంపిడిఓ భారతి,జేడ్పిటీసీ సర్వొణి సరోజా, వైస్ ఎంపీపీ మంజుల రాజు గౌడ్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు యూసుఫ్, వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపిటీసీలు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
One Tv News