One Tv News - NEWS / కర్నూలు జిల్లా : జర్నలిస్టుల కు మంజూరు చేసే అక్రిడిటేషన్ల లో రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 38 ను వెంటనే రద్దు చేయాలని కర్నూల్ జర్నలిస్ట్ జె.ఏ.సి నాయకులు డిమాండ్ చేశారు.అక్రిడేషన్స్ విషయంలో స్థానిక పత్రికలకు,కేబుల్ చానల్స్ కు తీవ్ర అన్యాయం జరిగిందనంటూ జిల్లా కలెక్టర్ సృజనకు వినతి పత్రం అందచేశారు.
ప్రధాన పత్రికలకు సైతం కోత విధించారని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం అకృడేషన్స్ మంజూరులో తన పంథా మార్చుకోకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జర్నలిస్టుల డిమాండ్ ను ప్రభుతానికి సిఫారసు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు రామకృష్ణ, హరినాధ్ రెడ్డి,నాయుడు,టిజి.ప్రసాద్,బతిన నవీన్,చంద్రశేఖరరెడ్డి,రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
One Tv News