One Tv News - NEWS / కర్నూలు జిల్లా : రైతులకు సాగు కష్టాలు అన్ని ఇన్ని కావు ఆరుగాలం కష్టపడి వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంటలు సాగుచేసిన రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు లేకనో, వర్షాలు లేకనో, ఓక్కోసారి అధిక వర్షాలు వచ్చి నష్టం అయ్యి రైతులు నష్టపోతుంటారు... దీంతో పంటల సాగుకు చేసేందుకు అయే ఖర్చును తగ్గించేందుకు నానావస్థలు పడుతుంటారు... ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కోసిగిలో దుర్నిగేరి తిమ్మయా అనే రైతు రెండు ఎకరాలలో పత్తి పంట సాగు చేసాడు. గతంలో సాగుచేసిన పత్తి పంట తెగుళ్లు సోకి ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు...
దీంతో ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునేందుకు 8వ తరగతి చదువుతున్న తన కుమారుడు నరసింహులు సహాయంతో పొలంలో కలుపు మొక్కలను తొలగించేందుకు తాను ఎద్దుగా మారి కలుపు మొక్కలను తొలగించారు... ఎద్దులతో కలుపు మొక్కలు తీయాలంటే ఎకరాకు రెండు వేల నుంచి మూడు వేల వరకు ఖర్చు అవుతుందని ఖర్చులు తగ్గించుకునేందుకు కొడుకు సహాయంతో కలుపు తీసామని రైతు తెలిపాడు.
One Tv News