One Tv News - NEWS / ఎన్టీఆర్ జిల్లా : యువత క్రీడల్లో రాణించాలంటే పట్టుదల కృషి ఆటలో నైపుణ్యం కలిగి ఉండాలి అని ఈరోజు భీమవరం లో రాష్ట్రస్థాయి రెల్లి టోర్నమెంట్ క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని టిడిపి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ స్థాయి దాతల సహాయ సహకారాలతో రెండో రోజుగా రాష్ట్రస్థాయి రెల్లి టోర్నమెంట్ క్రికెట్ పోటీలు 18 వార్డ్ రేల్లి యువత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి నాయకులు,కోళ్ల నాగేశ్వరరావు ,మెంటే పార్థసారథి, గంటా త్రిమూర్తులు, మద్దుల రాము,లంకీ చిన్నిలు క్రికెట్ క్రీడాకారులు తో పరిచయ వేదిక నిర్వహించి క్రికెట్ బ్యాటింగ్, బౌలింగ్ ఆటతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా దేహ దారిద్యం పెంపొందించే క్రికెట్ క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవడానికి ఇటువంటి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
One Tv News