Tuesday, 21 April 2026 02:46:58 PM

అక్షర యోధుడు నిస్వార్థ సేవకుడు మన తెలుగు టీవీ వన్ టీవీ ఆంధ్ర అక్షర సోలార్ కింగ్ సంస్థల అధినేత షేక్ మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు

కర్నూలు

Date : 17 June 2023 08:52 PM Views : 189

One Tv News - NEWS / కర్నూలు జిల్లా : అక్షర యోధుడు నిస్వార్థ సేవకుడు మన తెలుగు టీవీ వన్ టీవీ ఆంధ్ర అక్షర సోలార్ కింగ్ సంస్థల అధినేత షేక్ మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు శుక్రవారం కర్నూల్ నగరంలో అత్యంత అట్టహాసంగా జరిగాయి ఎస్ఎంబి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం దివ్యాంగులకు ట్రై సైకిల్లు, వృద్ధులకు బెడ్లు బెడ్ షీట్లు, పేదలకు వస్త్ర దానం మొక్కల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించారు కార్యక్రమంలో కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ ఎం సంజీవకుమార్ కర్నూల్. మాజీ మంత్రి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ నగర మేయర్ రామయ్య కర్నూల్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి రాగ మయూరి సంస్థల అధినేత కేజే రెడ్డి కర్ణాటక రాష్ట్రానికి చెందిన కన్నడ వన్ టీవీ సిబ్బంది సోలార్ కింగ్ సిబ్బంది అభిమానులు తదితర ప్రముఖులు పాల్గొని చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా ఘనంగా సన్మానించి అభినందించారు.

రాయలసీమ ముఖద్వారం కర్నూల్ నగరం కేంద్రంగా మీడియా రంగంలో తనదైన శైలిలో రాణిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర వహిస్తూ పేదలకు అండగా ఉంటున్న అక్షర యోధుడు మన తెలుగు టీవీ వన్ టీవీ ఆంధ్ర అక్షర సోలార్ కింగ్ సంస్థల అధినేత షేక్ మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు శుక్రవారం కర్నూల్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించారు ఎస్ఎంబి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని విశాల్ మార్ట్ నుంచి మీడియా ప్రధాన కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు ర్యాలీతో కార్యాలయానికి చేరుకున్న సీఎండీ షేక్ మహబూబ్ బాషా కు అభిమానులు మీడియా సిబ్బంది సోలార్ కింగ్ సిబ్బంది కర్ణాటక నుంచి తరలివచ్చిన అభిమానులు భారీ ఎత్తున బాణసంచా కాల్చి గజమాలతో స్వాగతం పలికారు. రాజ్యసభ మాజీ సభ్యులు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ స్వయంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి అభినందించారు. జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ను కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ కుమార్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మీడియా రంగంలోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు షేక్ మహబూబ్ బాషాను ఆయన అభినందించారు కర్నూల్ నగర మేయర్ బివై రామయ్య మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్న షేక్ మహబూబ్ బాషాను రాజకీయ రంగంలోకి రావాలని ఆహ్వానించారు. అంతేకాక వైసీపీ పార్టీలో చేరి ప్రజలకు మరింత సేవలు అందించాలని కోరారు. కర్నూల్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఓవైపు మీడియా సంస్థలు నడుపుతూ మరోవైపు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు .వైసీపీ మహిళా నాయకురాలు కార్పొరేటర్ శ్వేతా రెడ్డి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. నగరంలోని ప్రముఖ కంటి వైద్య నిపుణులు, సుశీల నేత్రాలయ అధినేత డాక్టర్ సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేత్ర దానం చేయాలని పిలుపునిచ్చారు సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజాసేవలో నిమగ్నమైన షేక్ మహబూబ్ బాషాను అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న నగర ప్రముఖులకు సిఎండి షేక్ మహబూబ్ బాషా ఘనంగా సన్మానించి మెమొంటోలను అందించారు కార్యక్రమంలో నటరాజ కళామందిరం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి .గాయకుడు చంద్రగంటి మద్దయ్య తన పాటలతో అలరించారు. జి ఎస్ ఎన్ ఆర్ విద్యానికేతన్ విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. ధర్మవరం జానపద కోకిల సరళ తన జానపద గేయాలతో ఆహ్వానితులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీ డిఎస్పి మహబూబ్ బాషా ,జడ్జి అనురాధ, అవోపా నాయకురాలు, బిజెపి రాష్ట్ర నాయకులు హరీష్, వైసిపి రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి ,వైసీపీ కార్పొరేటర్లు రాజేశ్వర్ రెడ్డి, కృష్ణకాంత్, విక్రమ్ సింహరెడ్డి ,వైసిపి నాయకులు కిషన్, ప్రశాంత్ ఎస్ కే మోటార్స్ అధినేత షోయబుద్దీన్ ఖాద్రి , వైద్య శిబిరం నిర్వాహక వైద్యులు డాక్టర్ సలీం, డాక్టర్ శ్రీనివాసరెడ్డి ,తదితర ప్రముఖులు పాల్గొని అభినందించారు .అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన మీడియా సిబ్బంది, సోలార్ సిబ్బంది, స్థానిక ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :