One Tv News - NEWS / కడప జిల్లా : సదరన్ క్యాంపు నిర్వహించి వికలాంగ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితులు నిరసనకు దిగారు. నాలుగు వారాలుగా దూర ప్రాంతాల నుండి వచ్చి పోతున్నా, వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప జిల్లా జమ్మలమడుగు లోని సామాజిక ఆరోగ్య కేంద్రం ఎదుట ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులు ఆందోళనకు దిగారు. సోమవారం ఆస్పత్రి ఎదుట వీల్ చైర్ల లోనే బైటాయించి నిరసనకు దిగారు. కుటుంబ సభ్యులతో పాటు వికలాంగులు బైఠాయించారు. ప్రతి సోమవారం సదరన్ క్యాంపు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంది. అయితే నాలుగు వారాలుగా కడప, ప్రొద్దుటూరు నుండి వైద్యులు రాకపోవడంతో క్యాంపు నిర్వహించడం లేదు. వైయస్సార్ జిల్లా నుండి కాకుండా అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి బాధితులు వచ్చి వెళ్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్నామని, వైద్యులు సదరన్ క్యాంపు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సబబు కాదని వాపోయారు. సూపర్ండెంట్ రఫిక్ భాష మాట్లాడుతూ వచ్చేవారం ఖచ్చితంగా వైద్యులను ఏర్పాటు చేసి క్యాంపు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
One Tv News