Tuesday, 21 April 2026 02:53:24 PM

అర్హులైన అందరికీ డబుల్ ఇల్లు మంజూరు

మెదక్

Date : 17 May 2023 09:38 AM Views : 174

One Tv News - NEWS / మెదక్ జిల్లా : మెదక్ నియోజకవర్గ అభివృద్ధి తో పాటు ప్రజా సమస్యలు పరిష్కారంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ముందుంటున్నారు. ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం కోసం ప్రతినెల 2,16 తేదీల్లో మెదక్ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి అధికారులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రోజు నిర్వహించారు.మెదక్ నియోజకవర్గంలోని మెదక్, పాపన్నపేట,రామాయంపేట,నిజాంపేట,శంకరంపేట ఆర్ ,హవేలీఘనాపూర్ మండలాల నుంచి ప్రజలు వచ్చి ఎమ్మెల్యే కి తమ సమస్యలను విన్నవించుకున్నారు. పింఛన్లు,డబల్ బెడ్ రూమ్, రెవెన్యూ కు సంబంధించిన సమస్యలు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అర్హులైన అందరికీ డబుల్ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

మీకోసం కార్యక్రమంలో వచ్చిన సమస్యలను అక్కడే ఉన్న అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. అందుబాటులో లేని అధికారులకు ఫోన్ ద్వారా సమస్య లను వివరించి పరిష్కార దిశగా కృషి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్య రెడ్డి,ఆత్మ కమిటీ చైర్మన్ అంజ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు అకిరెడ్డి.కృష్ణ రెడ్డి,భీమరి కిషోర్, జయరాజ్,ఆర్కే శ్రీనివాస్, మెదక్ రైతుబంధు అధ్యక్షులు కిష్టయ్య, హవేళిఘనాపూర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, ఎమ్మార్వో నవీన్ కుమార్,మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్,ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :