One Tv News - NEWS / మెదక్ జిల్లా : విధి నిర్వహణలో రెండు చేతులు కోల్పోయిన విద్యుత్ ఆర్టిజన్ గ్రేడ్ 2 కార్మికుడికి తోటి ఉద్యోగులు అండగా నిలిచారు. మెదక్ జిల్లా రామాయంపేట విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని నిజాంపేట సెక్షన్ లో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ ఆర్టిజన్ గ్రేడ్ 2 కార్మికుడు ఎన్ రవి ప్రమాదవశాత్తు విధినిర్వహణలో విద్యుత్ షాక్ తగిలి రెండు చేతులు కోల్పోయాడు.
రవి నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో విద్యుత్ ఉద్యోగులంతా ఏకమయ్యారు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల సోషల్ మీడియా గ్రూపులలో శ్రీశైలం అనే ఉద్యోగి రవి దీనస్థితిపై పోస్ట్ చేయడంతో ఉద్యోగులంతా కదిలి వచ్చారు రవికి విరాళాలను అందజేశారు సుమారు 6 లక్షల మేర విరాళాలు జమ కావడంతో నేడు రామాయంపేట పట్టణంలోని శ్రీకర ఫంక్షన్ హాల్ లో టిఆర్ఎస్ వి కె ఎస్ యూనియన్ మెదక్ సర్కిల్ జిల్లా కార్యదర్శి ఓరం సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రవితో పాటు వారి కుటుంబానికి విద్యుత్ ఉద్యోగులు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు చేతులు కోల్పోయి దీనస్థితిలో ఉన్న రవికి విద్యుత్ కార్మికులమంతా అండగా ఉంటామని ఎలాంటి ఆందోళన చెందవద్దని ధైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ వి కే ఎస్ జిల్లా అధ్యక్షులు ఉప్పరి నర్సింగ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్ల తిరుపతి, సిఎస్సి శ్రీశైలం, తూప్రాన్ డివిజన్ అధ్యక్షులు చేకూరి రాములు, గౌరవ అధ్యక్షులు పంబాల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూరం చంద్రమౌళి కంపనీ అసిస్టెంట్ సెక్రటరీ అక్కల బాలయ్య మెదక్ డివిజన్ అధ్యక్షులు నాగరాజు సెక్రెటరీ అశోక్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా ఉపాధ్యక్షులు ధనరాజ్, తదితరులు పాల్గొన్నారు.
One Tv News