Sunday, 19 April 2026 07:20:06 PM

గ్రామ స్థాయిలో క్రీడల ప్రోత్సాహానికి క్రీడా ప్రాంగనాలు ఏర్పాటు

జగిత్యాల

Date : 16 May 2023 08:18 AM Views : 166

One Tv News - NEWS / జగిత్యాల జిల్లా : జగిత్యాల పట్టణ వివేకానంద మినీ స్టేడియంలో జగిత్యాల అర్బన్, రూరల్ ,మరియు మున్సిపల్ పరిది లో సీఎం కప్ క్రీడా పోటీలను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రామ స్థాయిలో క్రీడల ప్రోత్సాహానికి క్రీడా ప్రాంగనాలు ఏర్పాటు చేశారన్నారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం,ఉల్లాసం పెంపొందుతుందన్నారు.క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు చాలా మంది చేదువుల్లో సైతం రాణిస్తారని అన్నారు.

తల్లిదండ్రులు క్రీడలపట్ల పిల్లలను ప్రోత్సహించాలి. క్రీడా మైదానాలు అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి. క్రీడాకారులు, వాకర్స్ కోసం స్టేడియం లో రెండు జిమ్ లు ఏర్పాటు. మైదానంలో పెవిలియన్ కోసం ఎంపి దామోదర్ రావు గారి నిదులు నుండి 5 లక్షల రూపాయల మంజూరు అయ్యాయని 5 లక్షల ప్రొసీడింగ్స్ చూపించిన ఎమ్మెల్యే. Sknr డిగ్రీ కళాశాల మైదానంలో చెట్లతో పచ్చదనం ఉన్నందువల్ల క్రీడాకారులకు కొంత ఉపయోగంగా ఉంటుంది అని,అక్కడ కూడా కొన్ని క్రీడలు ఏర్పాటు చేయాలని అన్నారు..


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :