One Tv News - NEWS / మేడ్చల్ /దమ్మాయిగూడ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ లో ఈరోజు గాంధీ చౌరస్తా వద్ద కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాణాసంచాలు పేల్చి , స్వీట్లు పంపిణీ చేసి కాంగ్రెస్ పాటలతో సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిని రవి, యూత్ కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మొహమ్మద్ సజ్జధ్ లు మాట్లాడుతూ... కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు కర్ణాటక రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక రాష్ట్రం సౌబ్రాత్తుత్వ సామరస్యాన్ని పెంపొందించే విధంగా అడుగులు వేయాలని అన్నారు.
ఆశించిన కర్ణాటక ప్రజల తీర్పును యావద్దేశం గర్వించదగ్గవేసి విషయంగా చూస్తోంది. కర్ణాటక రాష్ట్రం దేశానికి ఒక దిక్సూచిగా మారి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.
One Tv News