Tuesday, 21 April 2026 02:49:53 PM

హనుమాన్ జయంతి వేడుకలు

ఉప్పల్

Date : 15 May 2023 09:53 AM Views : 147

One Tv News - NEWS / మేడ్చల్ జిల్లా : మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్ బి కాలనీ నాలుగో డివిజన్ మంగాపురం కాలనీలో నెలకొన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం ఈవో కె వెంకన్న మాట్లాడుతూ ఉదయం మంగళ వాయిద్యం సుప్రభాత సేవ స్వామి వారికి అభిషేకం 108 కలశ స్నాపన తిరుమంజనం లక్ష్మీ నాగవల్లి తమలపాకులతో అర్చన సాయంత్రం విశేష గ్రామోత్సవ సేవ నిర్వహించామన్నారు

ఈ కార్యక్రమంలో వీర ఆంజనేయ స్వామి భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయం ఈవో కె వెంకన్న తెలిపారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :