One Tv News - NEWS / ప్రకాశం జిల్లా : .ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పోలేపల్లి గ్రామం లో ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు పోలేపల్లి గ్రామానికి చెందిన దేవి శెట్టి భారత్ కుమార్ త్రిపురాంతకం లో దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు పోలేపల్లి గ్రామం నుండి త్రిపురాంతకం గ్రామానికి వెళ్లి రాత్రి కి వస్తుండేవాడు ఇటీవల కాలంలో లో క్రికెట్ బెట్టింగ్ లో బాగా నష్టపోయినట్లు 10 నుంచి 12 లక్షలలో బాకీ అయినట్టు తెలుస్తోంది బెట్టింగ్ రాయుళ్లు డబ్బులు ఇవ్వాలని వత్తిడి చేయటం తో కొద్దిరోజుల గా ఇంట్లో మౌనంగా ఉంటూ శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయం లో పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని కేకలు వేయటం తో స్థానికులు వెళ్ళేసరికి మంటలలో కాలిపోతుండటం తో మంటలను అర్పి మార్కాపురం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు
అప్పటికే పూర్తిగా కాలిపోవడంతో హాస్పిటల్ తరలించగా వైద్యులు మరణించినట్టు ధ్రువీకరించారు.
One Tv News