One Tv News - NEWS / కడప జిల్లా : బద్వేలు తాలూకాలో త్వరలో జరగబోయే అసైన్మెంట్ కమిటీ లో దళితులకు చెందిన భూములను దళితులకు ఇవ్వాలని, అర్హులైన నిరుపేదలకు భూ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని పూలే అంబేడ్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ ముండ్లపాటి.పిచ్చయ్య పేర్కొన్నాడు. శుక్రవారం నాడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..... గతంలో దళితులకు పట్టాలు ఇచ్చారే గాని నీటి వసతి లేక ఆర్థిక స్తోమత లేక బంజరు భూములుగా ఉండుట సాకు సూపి, ఆ భూములను అధికారులతో లాలూచీపడి అగ్రవర్ణ పెత్తందారులు ఆన్లైన్ చేయించుకుని సొంతం చేయించుకునేటట్లు అసైన్మెంట్ కమిటీలు పెట్టి అక్కుదారులుగా పొందేటందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఆ పద్ధతి మంచిది కాదని, ఇప్పటికైనా బద్వేల్ తాలూకా దళితుల భూములను దళితులకు చెందే విధంగా అధికార పార్టీ నాయకులు అధికారులు చొరవ చూపాలని కోరారు. ఆ విధంగా చేయకపోతే పెద్ద ఎత్తున తాలూకా స్థాయిలో ఉద్యమాల బాట పట్టవలసి వస్తుందని హెచ్చరించారు.
One Tv News