One Tv News - NEWS / ఏలూరు జిల్లా : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వెలిసిన ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జన్మదిన వేడుకలకు శ్రద్ధలతో అన్ని ఏర్పాట్లు సిద్దం చేసినట్టు అభయాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త సుధాకర్ స్వామి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు బైపాస్ రోడ్డులో వెలిసి ఉన్న 60 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహానికి పాలాభిషేకం,దీప, ధూప , నైవేద్యాలతో ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు.
కంకణాధారతో పండరి భజన, అగ్నిగుండం ప్రవేశం తోపాటు హనుమాన్ చాలీసా మంత్రోచ్ఛారణ కార్యక్రమాలతోపాటు ఆలయానికి వచ్చు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేయనున్నట్లు తెలిపారు.
One Tv News