Wednesday, 15 April 2026 04:35:08 PM

BJP మహా సంపర్క అభియాన్ లో భాగంగా మేడ్చల్ అసెంబ్లీ సీనియర్ నాయకుల సమావేశం

పోచారం

Date : 08 June 2023 08:33 AM Views : 350

One Tv News - NEWS / మేడ్చల్ జిల్లా : మేడ్చల్ జిల్లాపోచారం మున్సిపల్ పరిధి ఎస్.బి.ఆర్ ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ మహా సంపర్క అభియాన్ లో భాగంగా మేడ్చల్ అసెంబ్లీ సీనియర్ నాయకుల సమావేశంకు ముఖ్య అతిధిగా జాతీయ ఉపాధ్యక్షురాలు భారతీబెన్ షియాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తెలంగాణ ప్రాంతాన్ని ఏం అభివృద్ధి చేశారని శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతం పూర్తిగా వెనుకబడిందని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుకు తీసుకెళ్తామని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ బిజెపి రూరల్ అధ్యక్షులు పటోళ్ల విక్రమ్ రెడ్డి సీనియర్ నాయకులు బిక్కునాథ్ నాయక్, పోచారం మున్సిపల్ ఒకటో వర్డ్ కౌన్సిలర్ గొంగళ్ల మహేష్, సురేష్ నాయక్, రామోజీ, రామతీర్థం, మహిపాల్ రెడ్డి, బిజెపి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :