Tuesday, 21 April 2026 02:46:16 PM

తాళ్లరేవు బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

తాళ్లరేవు

Date : 15 May 2023 10:04 AM Views : 142

One Tv News - NEWS / కాకినాడ జిల్లా : కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రైవేట్ బస్సు ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తాళ్ళరేవు బైపాస్ రోడ్డులో ప్రయాణిస్తుండగా.. ఆటోను ప్రైవేట్ బస్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని ఆస్పత్రికి తరలించామని స్థానికులు తెలిపారు. బస్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది.. మృతదేహాలు చెల్లా చెదురుగా పడ్డాయి. ప్రైవేట్ బస్ ఢీ కొన్న సమయంలో ఆటోలో ఎనిమిది మంది ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతోపాటు.. మృతుల వివరాలు తెలయాల్సి ఉంది.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :