One Tv News - NEWS / ఏలూరు జిల్లా : ఏలూరు జిల్లా నూజివీడులో గోవులను అనకాపల్లి నుండి హైదరాబాద్ కబేలాకు తరలిస్తున్న రెండు ఐచర్ వ్యానులను హనుమాన్ సేన , గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో పట్టుకొని నూజివీడు పోలీసులకు అప్పచెప్పారు . సుమారు రెండు ఐచర్ వ్యాన్లలో 200 వరకు గోవులు హైదరాబాద్ కబేలాకు తరలిస్తున్నారు . వ్యాన్లను నడుపుతున్న డ్రైవర్ ఇవి ఎక్కించిన చోట నుండి దింపడం వరకే తమకు తెలుసని సమాధానం ఇస్తున్నారు.
నూజివీడు మీదుగా ప్రతి నిత్యం గోవులను హైదరాబాద్ కబేలాకు తరలిస్తున్నారని , గోవులను కబిలాకు తరలిస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గో సంరక్షణ కమిటీ సభ్యులు , హనుమాన్ సేన సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు .
One Tv News