Tuesday, 21 April 2026 02:48:20 PM

YCP పార్టీలోకి రావాలంటూ సోలార్ కింగ్ అధినేత షేక్ మహబూబ్ భాషాను ఆహ్వానించిన మేయర్ BY.రామయ్య

కర్నూలు

Date : 17 June 2023 08:58 PM Views : 194

One Tv News - NEWS / కర్నూలు జిల్లా : ఎన్నో సామాజిక , సాంస్కృతిక , సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతున్న 1టివి, మన తెలుగు టివి, ఆంధ్ర అక్షర దినపత్రి క , సోలార్ కింగ్ అధినేత మహబూబ్ భాషా రాజకీయాల్లోకి వస్తే పేద, మధ్య తరగతి , బడుగు బలహిన వర్గాల ప్రజల కు న్యాయం చేస్తారని కర్నూల్ మేయర్ , వైసిపీ నేత బి వై రామయ్య అన్నారు. శుక్రవారం భాషా జన్మదిన వేడుకల సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పలూ ఆసక్తికర , సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే న్యూస్ ఛానళ్ళు, దినపత్రిక అధినేతగా మహబూబ్ భాషా ఆప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండ టం అభినందనీయమన్నారు. విశేష జనాదరణ కలిగిన మహబూబ్ భాషా లాంటి వారిని రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేసే వారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి సైతం అమిత గౌరవం వుందన్నారు. ఈ నేపధ్యంలో మహబూబ్ భాషా రాజకీయాల్లోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయవచ్చని సూచిస్తూ... తమ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ మహబూబ్ భాషాను మేయర్ రామయ్య ఆహ్వానించ టం తో అభిమానులు పెద్దఎత్తున హర్ష ద్వానాలు చేయటంతో సభా ప్రాగణం కేరింతలతో మార్మోగింది.

కర్నూల్ మాజీ ఎమ్మెల్యే , వైసిపీ సినియర్ నాయకులు ఎస్ వి మోహన్ రెడ్డి మాట్లా డుతూ ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడు కున్న మీడియా రంగాన్ని ఎంచుకున్న మహబూబ్ భాషా ఆ రంగంలో తనదైన శైలిలో రాణిస్తుండటం శుభపరిణామమ న్నారు. సేవా కార్యక్రమాలు చేసే నేతలు అరుదుగా వుంటారని , మహబూబ్ భాషా భవిష్యత్తులో మరిన్ని జన్మదిన వేడుకలు ఆనందమయంగా జరుపుకుంటూ మరింత మంది ప్రజలకు సేవ చేయాలని మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :