Tuesday, 21 April 2026 02:40:56 PM

నకిలీ కరెన్సీ నోట్లు , బంగారం చలామణి చేస్తున్న వ్యక్తి ఆరెస్ట్

పుట్టపర్తి

Date : 17 May 2023 07:54 PM Views : 206

One Tv News - NEWS / శ్రీసత్యసాయి జిల్లా : నకిలీ కరెన్సీ నోట్లు, బంగారాన్ని చలామని చేసేందుకు కారులో తరలిస్తున్న వ్యక్తిని ధర్మవరం వన్ టౌన్ పొలీసులు అదుపులోకి తీసుకున్నట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ. నిందితుడు నుంచి 21 లక్షల నకిలీ కరెన్సీని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కదిరికి చెందిన బుక్కే గోవింద నాయక్ అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో ముదిగుబ్బ పట్టణంలో కారులో వెల్తుండగా 21 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను, 50 గ్రాముల ఒరిజినల్ బంగారు బిస్కెట్లను, 102 గ్రాముల నకిలీ బంగారు బిస్కెట్లను, 108 గ్రాముల నకిలీ బంగారు హారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితున్ని రిమాండ్ కి పంపినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.

ఇలాంటి పనులు చేసే ఏ వ్యక్తిని ఉపేక్షించేది లేదని,ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న ధర్మవరం వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై హేమంత్ కుమార్ తన సిబ్బందిని ఎస్పీ మాధవ్ రెడ్డి అభినందించారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :