Sunday, 19 April 2026 07:11:20 PM

లింబో స్కెటింగ్ లో 4 వరల్డ్ రికార్డ్స్ సాధించిన చిన్నారి బుజ్జిరెడ్డి

తాడిపత్రి

Date : 27 June 2023 09:39 AM Views : 198

One Tv News - NEWS / అనంతపురం జిల్లా : అనంతపురం జిల్లా తాడిపత్రి లో లింబో స్కెటింగ్ లో 4 వరల్డ్ రికార్డ్స్ సాధించిన చిన్నారి బుజ్జిరెడ్డి అవినాష్ రెడ్డి ని డిఐజి అమ్మిరెడ్డి అభినందించారు లింబో స్కేటింగ్ లో చిన్నారి బుజ్జి రెడ్డి అవినాష్ రెడ్డి వరల్డ్ రికార్డు సాధిస్తున్నారు. మూడు సంవత్సరాల నుంచి లింబో స్కేటింగ్ లో అద్భుతాలు సాధిస్తున్నారు. ఫైర్, బ్లెడ్, గాజులు,కట్టింగ్ మిషన్,డ్రిలింగ్ మిషన్ ఏర్పాటు చేసిన 8.5 ఇంచులు ఎత్తు 15 మీటర్లు పొడవుతో 9 సెకండ్లలో ఈ ఫీట్ సాధించారు.అనంతపురం రేంజ్ డిఐజి అమ్మిరెడ్డి తాడిపత్రి లో చిన్నారి అవినాష్ రెడ్డి చేసిన సాహసాన్ని స్వయంగా తిలకించారు. తిరుపతి నుంచి వచ్చిన ముగ్గురు జడ్జిలు చిన్నారి చేసిన లింబో స్కేటింగ్ను స్వయంగా పరిశీలించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు .డీఐజీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి ప్రాంతానికి చెందిన చిన్నారి అవినాష్ రెడ్డి అద్భుతంగా లింబో స్కేటింగ్ చేస్తున్నారన్నారు. చిన్నారి ఇప్పటికే వజ్ర బుక్ ఆఫ్ రికార్డ్ వజ్రా నేషనల్ రికార్డ్ గ్లోబల్ రికార్డు హిందుస్థాన్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారన్నారు. తాడిపత్రికి చెందిన టాలెంట్ అకాడమీ స్కేటింగ్ కోచ్ మధు అవినాష్ రెడ్డిఅవార్డులు సాధించేలా కోచింగ్ ఇస్తున్నారన్నారు.

అవినాష్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని చిన్నారి మరిన్ని రికార్డులు సాధిస్తారని ప్రోత్సహిస్తున్న తాత డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తండ్రిని అభినందిస్తున్నారని పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి తాత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తన మనవడు ప్రపంచ రికార్డులు సాధించడం తమ కుటుంబ సభ్యులకి కాకుండా తాడిపత్రికి గర్వకారణమన్నారు.


One Tv News
CMD

One Tv News

మరిన్ని వార్తలు

Copyright © 1 TV News 2026. All right Reserved.

Developed By :